Abn logo
Mar 29 2020 @ 06:05AM

కాన్వొకేషన్‌ పట్టాల కోసం దరఖాస్తులు

ఎచ్చెర్ల, మార్చి 28: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2, 3 కాన్వొకేషన్‌లో పట్టాలు పొందేందుకు ఏప్రిల్‌ 24వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు తెలిపారు. డిగ్రీ, పీజీ, ప్రొఫెషన్‌ కోర్సులు, ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2018-19 సంవత్సరం వరకు చదివినవారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement