Tata Instituteలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-06-30T20:56:10+05:30 IST

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) - పీజీ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది

Tata Instituteలో ప్రవేశానికి దరఖాస్తులు

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) - పీజీ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

ఇది ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌. ఇందులో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఆర్హత: గుర్తింపు  పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ లేదా మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.530

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూన్‌ 30  

ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూలు: ఆగస్టు 12, 13 

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 31న

తరగతులు ప్రారంభం: అక్టోబరు 8 నుంచి

వెబ్‌సైట్‌: admissions.tiss.edu/admissions/ stp/programmes/

Updated Date - 2022-06-30T20:56:10+05:30 IST