ఫాక్స్‌కాన్, యునిమిక్రాన్ ఉత్పత్తి నిలిపివేత * చైనా నియంత్రణల నేపథ్యంలో... ఆపిల్ నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-14T23:54:11+05:30 IST

కోవిడ్ నేపథ్యంలో... చైనా నియంత్రణల కారణంగా... ఆపిల్ సరఫరాదారులు ఫాక్స్‌కాన్, యునిమిక్రాన్ ఉత్పత్తిని తగ్గించారు.

ఫాక్స్‌కాన్, యునిమిక్రాన్ ఉత్పత్తి నిలిపివేత  * చైనా నియంత్రణల నేపథ్యంలో... ఆపిల్ నిర్ణయం

లండన్ : కోవిడ్ నేపథ్యంలో... చైనా నియంత్రణల కారణంగా... ఆపిల్ సరఫరాదారులు ఫాక్స్‌కాన్, యునిమిక్రాన్ ఉత్పత్తిని తగ్గించారు. . పాశ్చాత్య కంపెనీలను అరెస్టులు, నిర్బంధాలతో మాస్కో  బెదిరిస్తోందంటూ ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి టెక్ హబ్ కఠినమైన చర్యలను విధించిన తరువాత, చైనా నగరమైన షెన్‌జెన్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆపిల్ సరఫరాదారులు ఫాక్స్‌కాన్, యునిమిక్రాన్ టెక్నాలజీ కార్ప్ సోమవారం ప్రకటించాయి. చైనా సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే  షెన్‌జెన్ దక్షిణ ప్రాంతంలో... డజన్ల కొద్దీ కొత్త స్థానిక కేసులు నమోదైన నేపథ్యంలో... సామూహిక పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే... ప్రజారవాణాను నిలిపివేయడంతోపాటు వీలైనంత వరకు ఈ వారం ‘వర్క్ ఫ్రం హోం’ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 


తదుపరి నోటీసు జారీ అయ్యేంతవరకు దాని షెన్‌జెన్ కార్యకలాపాలు నిలిపివేయడం జరుగుతుందని, కాగా...  ఉత్పత్తిలో అంతరాయాన్ని తగ్గించడానికి బ్యాకప్ ప్లాంట్‌లను మోహరిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెన్‌జెన్‌లో ఫాక్స్‌కాన్, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలు వారం మొదటి సగం వరకు నిలిపివేయబడతాయని సంబంధిత వర్గాలు పనేర్కొన్నాయి.  బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సమయంలో ఇటువంటి వ్యవస్థను అమలు చేశారు. చిప్ సబ్‌స్ట్రేట్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మేకర్ యునిమిక్రాన్ టెక్నాలజీ ఇంటెల్‌కు కూడా సరఫరా చేస్తోంది. ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మేకర్ సన్‌ఫ్లెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్. సన్‌ఫ్లెక్స్ తన ప్లాంట్ ఆదివారం వరకు మూసివేతలోనే ఉంటుందని వెల్లడించింది. 

Updated Date - 2022-03-14T23:54:11+05:30 IST