యాపిల్‌ ‘హోమ్‌పాడ్‌ మిని’ నుంచి కూడా ‘గానా’

ABN , First Publish Date - 2021-08-28T05:59:05+05:30 IST

మన దేశంలోనే అతి పెద్ద మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ ‘గానా’ పాటలను ఇప్పుడు హోమ్‌పాడ్‌ మిని ద్వారా కూడా యాక్సెస్‌ చేయొచ్చు. ఇందులో 25 భాషలకు చెందిన నాలుగున్నర కోట్ల పాటలు ఉన్నాయి. హోంపాడ్‌ మినీపై ఐఔస్‌ 14.1 ఆపై వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉంది.

యాపిల్‌ ‘హోమ్‌పాడ్‌ మిని’ నుంచి కూడా ‘గానా’

 మన దేశంలోనే అతి పెద్ద మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ ‘గానా’ పాటలను ఇప్పుడు హోమ్‌పాడ్‌ మిని ద్వారా కూడా యాక్సెస్‌ చేయొచ్చు. ఇందులో  25 భాషలకు చెందిన నాలుగున్నర కోట్ల పాటలు ఉన్నాయి. హోంపాడ్‌ మినీపై ఐఔస్‌ 14.1 ఆపై వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉంది. సంగీత ప్రియులు ఇకపై ‘సిరి’ని ఈ పాటల కోసం కూడా అడగవచ్చు. 

‘గానా’ హోంపాడ్‌ మినీ స్ట్రీమింగ్‌...

 ‘ఐఫోన్‌’, ‘ఐపాడ్‌’, ‘ఐపాడ్‌ టచ్‌’లో యాప్‌ ఓపెన్‌ చేయాలి. యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. అయితే ఏవో కొన్ని స్ట్రీమింగ్‌ సర్వీసులకు మాత్రం సబ్‌స్ర్కిప్షన్‌ చేయాల్సి ఉంటుంది. 

 హోంపాడ్‌కు కనెక్ట్‌ అయ్యేందుకు ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

 హోంపాడ్‌పై స్ట్రీమింగ్‌ కోసం ఆన్‌స్ర్కీన్‌ నిబంధనలను చదువుకుంటూ  ముందుకు వెళ్లాలి...

ఇక హోంపాడ్‌ మినీ రూ.9,999కి మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అది తోడుంటే చాలు, సంగీతప్రియులు తమకు నచ్చిన పాటలను హాయిగా వినవచ్చు. 

Updated Date - 2021-08-28T05:59:05+05:30 IST