యాపిల్ కేక్
ABN , First Publish Date - 2021-12-25T20:14:27+05:30 IST
మైదా - 150 గ్రాములు, బేకింగ్ పౌడర్ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు, పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు
కావలసినవి: మైదా - 150 గ్రాములు, బేకింగ్ పౌడర్ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు, పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకకప్పు, యాపిల్స్ - మూడు, దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్, ఒక బేకింగ్ టిన్.
తయారీ: ఒక పాత్రలో మైదా తీసుకొని బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తరువాత వెన్న, పంచదార, కోడిగుడ్లు, పాలు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్ టిన్‌లో పోసి, పైన చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు ఉంచాలి. దానిపై పంచదార, దాల్చిన చెక్క పొడి చల్లాలి. ఈ టిన్‌ను ఓవెన్‌లో 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద 30 నుంచి 35 నిమిషాల బేక్ చేస్తే యాపిల్ కేక్ రెడీ అయినట్టే!