Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘యాపిల్ పాప’ ఇంటికొచ్చిందోచ్

సింగపూర్: యాపిల్ పాప ఇంటికొచ్చింది. డాక్టర్ ఆ పాపను తాజాగా డిశ్చార్జ్ చేశారు. యాపిల్ పాప ఏంటా..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఆ పాపను అలా అనడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ఆ పాప పుట్టినప్పుడు కేవలం ఓ యాపిల్ పండు ఎంత బరువు ఉంటుందో అంత బరువే ఉంది. అంతేకాదు.. ఈ పాప ప్రపంచంలోనే అతి చిన్న పాప కూడా అని అంచనాలున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌లోని ఓ జంటకు నెలలు నిండకుండానే ఓ బిడ్డ పుట్టింది. కేవలం 25 నెలల కాలంలోనే డెలివరీ కావడంతో చిన్నారి శరీరం పూర్తిగా వికసించలేదు. పాప తల్లికి ఓ అరుదైన బ్రడ్ ప్రెషర్‌తో కూడిన వ్యాధి బారిన పడింది. దాని వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణాపాయం నెలకొనడంతో నెలలు నిండకుండానే వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. 

ఫలితంగా అతి చిన్న శరీరంతో బిడ్డ జన్మించడమే కాకుండా కేవలం 212 గ్రాముల బరువు, 24 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంది. దీంతో చిన్నారి బతికే అవకాశం చాలా తక్కువని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్‌ తల్లిదండ్రులకు వెల్లడించింది. దాదాపు 13 నెలలుగా చిన్నారికి అక్కడి డాక్టర్లు చికిత్స అందించారు. అయితే ఇన్ని నెలల తరువాత చిన్నారి పూర్తి ఆరోగ్యంతో కోలుకుంది. ప్రస్తుతం చిన్నారి బరువు 6.3 కేజీలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కాగా.. చిన్నారి వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు క్రౌండ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. దాదాపు 4లక్షల డాలర్ల వరకు సేకరించి వాటితో ఇన్నాళ్లుగా పాపకు చికిత్స చేయించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement