మారనున్న కార్యాలయాల స్వరూపం

ABN , First Publish Date - 2021-06-09T04:54:58+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో నూతన క లెక్టరేట్‌ భవనంలోకి తరలనున్న నేపథ్యంలో పాత కార్యాల యాల స్వరూపం మారిపోనుంది.

మారనున్న కార్యాలయాల స్వరూపం

త్వరలో కొత్త కలెక్టరేట్‌లోకి తరలనున్న ప్రధాన శాఖల కార్యాలయాలు

ఇతర అవసరాలకు పాత ఆఫీసులు, స్థలాల వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి

నిజామాబాద్‌, జూన్‌ 8 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో నూతన క లెక్టరేట్‌ భవనంలోకి తరలనున్న నేపథ్యంలో పాత కార్యాల యాల స్వరూపం మారిపోనుంది. నగరం నడిబొడ్డున వి లువైన భూములు, భవనాలు ఉండడంతో వాటిని ప్రజల అవసరాలకు వినియోగించాలని నిర్ణయానికి వస్తున్నారు. సమీకృత మార్కెట్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు వి నియోగించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్ర భుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాలలకు కొన్ని కేటాయింపు లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

త్వరలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభం

జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం త్వరలో ప్రా రంభం కానుంది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ కార్యాలయాల తో పాటు ఇతర కీలకమైన శాఖలను కార్యాలయాలను కొ త్త భవనానికి తరలించనున్నారు. మొత్తం 30శాఖలకు రూ ంలను కేటాయిస్తున్నారు. విద్య, వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వ్యవసా య, ఉద్యానవనం, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారుల కార్యాలయాలు అన్ని కొత్త భవనంలోకి తరలిస్తున్నారు. వీటితో పాటు ఇతర శాఖలను కూడా కొత్త భవనంలో రూంలను కేటాయిస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌లో 30శాఖలకు కేటాయించడంతో కార్యాలయాలను అక్కడికి తరలిస్తారు.

ఇతర అవసరాలకు పాత భవనాలు

 కొత్త కలెక్టరేట్‌లోకి కార్యాలయాలను తరలించిన తర్వాత పాత కార్యాలయాల భవనాలు, స్థలాలు నిరుపయోగం గా ఉంటాయి. కార్యాలయాలు లేకపోవడం వల్ల వాటిని ఇత ర అవసరాలకు వినియోగించాలని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఆ భూములు, భవనాల ను ప్రజలకు ఉపయోగపడేవిధంగా అభివృద్ధి పనులకు వి నియోగించాలని భావిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న డీపీవో, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌, తహసీల్దార్‌ కార్యాలయాల వ ద్ద ఖాళీగా ఉండే భూములను కూరగాయల మార్కెట్‌కు ఉ పయోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు ఆ స్థలాలను పరిశీలించారు. అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ప్రభుత్వాని కి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కలెక్టరేట్‌ ప్రా రంభంకాగానే ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ భవనాలు అన్ని ఖాళీకానున్నాయి. ప్రగతి భవన్‌ నాలుగు అంతస్థులతో ఉం ది. వ్యవసాయ ఇతర శాఖల భవనాలు బాగానే ఉన్నాయి. నగరం మధ్యన ఈ కార్యాలయాలు ఉండడం వల్ల ఆసుప త్రి లేదా ఇరత అవసరాలకు వినియోగించాలని భావిస్తు న్నట్లు తెలుస్తోంది. ఆర్‌ అండ్‌ బీ,  ఇరిగేషన్‌ కార్యాలయాల స్థలంకు ఆర్టీసీ బస్టాండ్‌ను తరలించి ప్రస్తుతం ఉన్న బస్టా ండ్‌ స్థలాన్ని మెడికల్‌ కళాశాలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోం ది. వైద్య కళాశాల, ఆసుపత్రులకు ప్రస్తుతం ఉన్న స్థలాలు సరిపోకపోవడం, భవిష్యత్తులో ఆసుపత్రిని మరింత విస్తరి ంచే అవకాశం ఉన్నందున, కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యాలయాల భూములను డెవలప్‌మెంట్‌ కోసం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

భూములపై వ్యాపారుల కన్ను?

అంతేకాకుండా ఈ భూములు, భవనాలపై జిల్లాకు చెం దిన వ్యాపార సంస్థల యజమానులు కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. కొన్నేళ్లు లీజ్‌గా తీసుకుని భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూ ములు కావడం వల్ల భవిష్యత్తులో అవసరాలకు వీటిని వి నియోగించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తె లుస్తోంది. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభమై, కార్యాలయాలు తరలిన తర్వాత వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-09T04:54:58+05:30 IST