అప్పన్న హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు

ABN , First Publish Date - 2022-07-07T06:17:58+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు హుండీలలో సమర్పించిన మొక్కుబడులు, కానుకల ద్వారా సుమారు రూ.1.06 కోట్లు ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, దేవదాయశాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌ మూర్తి, వంసత్‌ పర్యవేక్షణలో బుధవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు.

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు
ఆదాయం లెక్కిస్తున్న స్వచ్ఛంద సేవకులు

సింహాచలం, జూలై 6: వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు హుండీలలో సమర్పించిన మొక్కుబడులు, కానుకల ద్వారా సుమారు రూ.1.06 కోట్లు ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, దేవదాయశాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌ మూర్తి, వంసత్‌ పర్యవేక్షణలో బుధవారం ఆలయ బేడామండపంలో  హుండీల లెక్కింపు చేపట్టారు.  గడచిన 33 రోజుల్లో రూ.1,06,96,264 నగదు, 140.2గ్రాముల స్వర్ణం, 7.9 కిలోల రజితం ఆభరణాల రూపంలో భక్తులు సమర్పించారు. వాటితో పాటు యూఎస్‌ఏకు చెందిన 485 డాలర్లు, యుఏఈకి చెందిన 2600 దీరమ్స్‌, సౌత్‌ ఆఫ్రికాకు చెందిన 50 రేండ్స్‌, సింగపూర్‌కు చెందిన 52 డాలర్లు, మలేషియాకు చెందిన 58 రింగిట్స్‌, ఇంగ్లాండ్‌కు చెందిన పది పౌండ్లు, ఐరోపాకు చెందిన పది యూరోలు, ఆస్ట్రేలియాకు చెందిన 20 డాలర్లు, ఖజానాకు లభించింది. హుండీల లెక్కింపులో దేవస్థానం ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, శ్రీహరి సేవా సత్సంఘ్‌, ఎస్‌వీఎల్‌ఎన్‌ వాకర్స్‌ క్లబ్‌ సేవకులు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-07-07T06:17:58+05:30 IST