రమణీయం అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణం

ABN , First Publish Date - 2020-06-03T11:35:00+05:30 IST

అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణాన్ని మంగళవారం రాత్రి 9.05 గంటలకు రమణీయంగా ..

రమణీయం అప్పనపల్లి బాలబాలాజీ కల్యాణం

మామిడికుదురు, జూన్‌ 2: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణాన్ని మంగళవారం రాత్రి 9.05 గంటలకు రమణీయంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, దేవదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన కల్యాణాన్ని అర్చకస్వాములు శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రధానార్చకుడు మద్దాల తిరుమల శింగరాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి సహస్రనామార్చన, చతుస్థానార్చనలు, బాలభోగ నివేదన, ధ్వజారోహణంలను అర్చకులు, పండితులు జరిపించారు.


ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక శివనాగసత్యనారాయణ (చిన్నా), సహాయ కమిషనరు పి.బాబూరావు పర్యవేక్షణలో జరిగిన కల్యాణాన్ని పరిమిత సంఖ్యలో హాజరైన భక్తులు వీక్షించారు. రావులపాలేనికి చెందిన మన్యం బ్రదర్స్‌ మూడు కిలోల మంచి ముత్యాలను తలంబ్రాలుగా సమర్పించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు-లక్ష్మి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిం చారు. 300 మంది భక్తులు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి కల్యాణోత్సవాల్లో పరోక్షంగా కర్తలుగా పాల్గొన్నారు.


ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి విగ్రహానికి రాజోలు తాలుకా, మామిడికుదురు మండల శెట్టిబలిజ సంఘ సభ్యులు గజమాల అలంకరించారు. కార్యక్రమంలో గుబ్బల శ్రీనివాస్‌, కాండ్రేగుల శ్రీనివాస్‌, వాసంశెట్టి శంకరరావు, జోగి రామకృష్ణ, వాసంశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T11:35:00+05:30 IST