అమరావతి: స్టీల్‌ప్లాంట్ విషయంలో పవన్‌కల్యాణ్ ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీని ఎందుకు ఒక్క మాట అనరని ఆయన ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న బీజేపీకి బద్వేల్, తిరుపతి ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అన్నారు. పవన్ విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.