‘ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలి’

ABN , First Publish Date - 2021-01-27T05:18:59+05:30 IST

ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసీ గిరిజనుడైన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు.

‘ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలి’
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనవరి 26: ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసీ గిరిజనుడైన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న హద్దులో ఉండి మాట్లా డాలని, ఎస్టీ పార్లమెంట్‌ సభ్యుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఆదివాసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. గతంలోనూ ఇదేవిధంగా ఎంపీ సోయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ మారుమూల గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిధులను రాబడుతూ స్థానికంగా అభివృద్ధికి ఎంతో పాటు పడుతున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు.  ఈ సమావేశంలో బీజేపీ సీనియర్‌ నాయకులు వేణుగోపాల్‌, జోగురవి,  సోమరవి, దినేష్‌, భూమన్న, మహేందర్‌, సంతోష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:18:59+05:30 IST