అపోలో హాస్పిటల్స్‌:

ABN , First Publish Date - 2020-09-15T05:49:31+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.226.24 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర నష్టాన్ని ప్రకటించింది.

అపోలో హాస్పిటల్స్‌:

అపోలో హాస్పిటల్స్‌: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.226.24 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.49.15 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.2,571.89 కోట్ల నుంచి రూ.2,171.50 కోట్లకు పడిపోయింది.  


దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌: తెలంగాణలో రూ.1,140.50 కోట్ల విలువైన జాతీయ రహదారి కాంట్రాక్టును గెలుచుకుంది. కాంట్రాక్టులో భాగంగా రేపల్లెవాడ నుంచి తెలంగాణ/మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.60 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. 24 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. 


మెర్సిడెస్‌ బెంజ్‌: అక్టోబరు నుంచి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. అంతర్గత వ్యయాలతో పాటు యూరోతో రూపాయి బలహీనపడటంతో ధరలను 2 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. 


డాబర్‌ ఇండియా:  కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆవ నూనెను విడుదల చేయటం ద్వారా వంట నూనెల విభాగంలోకి అడుగుపెట్టింది. కోల్డ్‌ ప్రెస్డ్‌ టెక్నాలజీ వినియోగంతో ఆవ నూనెలోని సహజసిద్ధమైన, ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు యధాతథంగా ఉంటాయని తెలిపింది. 


సిగ్నల్‌ఎక్స్‌: అమెరికాకు చెందిన 3లైన్స్‌ వెంచర్‌ క్యాపిటల్‌ నుంచి రూ.5.51 కోట్ల (7.5 లక్షల డాలర్లు) సమీకరించింది. సమగ్ర ఫైనాన్షియల్‌, లీగల్‌, రెగ్యులేటరీ సంస్థల కోసం ఏఐ ఆధారిత సాస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సిగ్నల్‌ఎక్స్‌ అందిస్తోంది. 

Updated Date - 2020-09-15T05:49:31+05:30 IST