Abn logo
Jun 23 2021 @ 23:37PM

ఏపీఎన్‌ఆర్‌పీఎ్‌స సేవలు అభినందనీయం

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), జూన్‌ 23: ప్రవాసాంధ్రులకు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబులు తెలిపారు. కువైట్‌లో మరణించిన షేక్‌ ఇమాం కుటుంబానికి ఏపీఎన్‌ఆర్‌పీఎ్‌స రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీఎన్‌ఆర్‌పీఎ్‌స చైర్మన్‌ వెంకట్‌ అనునిత్యం ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌పీఎ్‌స డైరెక్టరు ఇలియాస్‌, కార్పొరేటర్లు షఫి, కమాల్‌బాషాతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.


మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం

మహిళల ఆర్థిక ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. కడప నగరం ఖలీల్‌నగర్‌ ఆయేషా స్కూలులో బుధవారం మెప్మా ఆధ్వర్యంలో రెండో విడత వైఎ్‌సఆర్‌ చేయూత పథకాన్ని ఘనంగా ప్రారంభించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.


ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంలో వలంటీర్లు మెరుగైన సేవలందించాలని ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబులు పేర్కొన్నారు. 49వ డివిజన్‌ ఆలంఖాన్‌పల్లెలో సోమవారం నూతనంగా ఎంపికైన 8 మంది వలంటీర్లకు నియామక పత్రాలు అందించి మాట్లాడారు.