పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-05-16T05:20:46+05:30 IST

ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్జీవోస్‌ సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

సత్తెనపల్లిలో ఎన్జీవోస్‌ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి  

సత్తెనపల్లి, మే15: ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు విరమణ మయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. ప్రభుత్వ సర్వీసులోని ఉద్యోగులందరికి పీఆర్సీ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ప్రమోషన్లు, అలవెన్సులు పెండింగ్‌లో ఉన్నాయని, హెల్త్‌ సెక్రటరీ ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌లీవ్‌ బిల్లులు వెంటనే విడుదల  చేయాలని కోరారు. కాంట్రాకు ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని, వారికి జీతాలు చెల్లించడంతోపాటు క్రమబద్ధీకరించాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి త్వరలో ముఖ్యమంత్రిని కలవబోతున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు సమావేశంలో ఎన్జీవోస్‌ సంఘ పట్టణాధ్యక్షుడు పెండెం మణిరావు, నాయకులు ఆలేటి భూషణం, అంబేద్కర్‌, సుధాకర్‌, చందు, వంశీకృష్ణ, చంద్రకాంత్‌, రవిచంద్ర, ఫ్రాంక్లిన్‌, సుధాకర్‌ తదితరులున్నారు. 


Updated Date - 2022-05-16T05:20:46+05:30 IST