Abn logo
Apr 12 2021 @ 23:49PM

మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు


పాడేరు, ఏప్రిల్‌ 12: వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో మెడికల్‌ కళాశాలకు కేటాయించిన స్థలంలో జరుగుతున్న భూమి చదును, పాత భవనాల తొలగింపు పనులను పరిశీలించారు. భవనాల నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి కావాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి, టీడబ్ల్యూ ఈఈ కేవీఎన్‌ఎన్‌.కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement