తాత్కాలిక బోధకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-12-01T03:58:44+05:30 IST

తాత్కాలిక బోధకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

తాత్కాలిక బోధకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయ/అధ్యాపకులుగా 2020-21 విద్యాసంవత్సరంలో పని చేసేందుకు ఆసక్తి గల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్లం, గణితం, ఫిజిక్స్‌, కెమి స్ట్రీ, బాటనీ, జూవాలజీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, హిస్టరీ సబ్జెక్టుల్లో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్‌, బీఈడీ చేసిన ఇంగ్లిష్‌ మీడియంలో బోధించగల ఆసక్తి గలఅభ్యర్థులు తమ దరఖాస్తులను రాజేంద్రనగర్‌లోని టీటీడబ్ల్యూ ఐఐటీ స్టడీసెంటర్‌ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.  దరఖాస్తు ఫారాలకు వంద రూపాయల నగదు చెల్లించి పొందాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్‌ 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా అందించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-01T03:58:44+05:30 IST