ఉన్నత విద్యారంగం బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2021-07-28T06:43:07+05:30 IST

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం చేసే కృషికి సహకారం అందిస్తా మని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కళాశాల విశ్రాంతి అధ్యాపకుల సంఘం (ఏపీ జీసీఆర్‌టీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ పల్లె చంద్రశేఖరరెడ్డి, సూరె కృష్ణలు తెలిపారు.

ఉన్నత విద్యారంగం బలోపేతానికి కృషి
అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి

ఉన్నత విద్యారంగం బలోపేతానికి కృషి

 జీసీఆర్‌టీఏ నేతలు 

గవర్నర్‌పేట, జూలై 27: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం చేసే కృషికి సహకారం అందిస్తా మని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కళాశాల విశ్రాంతి అధ్యాపకుల సంఘం (ఏపీ జీసీఆర్‌టీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ పల్లె చంద్రశేఖరరెడ్డి, సూరె కృష్ణలు తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్‌లో సంఘ ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రభుత్వ కళాశాలల్లో మూడు దశాబ్ధాలుగా నైతిక విలువలతో కూడిన ఉన్నత విద్య అందించి, పదవీ విరమణ తరువాత ప్రభు త్వం చేపట్టే ఉన్నత విద్యా సంస్కరణలకు సలహాలు, సూచనలు అందిం చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పింఛన్‌ ప్రయోజనాలు, బకాయిలు, కరువు భత్యం, వైద్య ఆర్థిక సహాయం, అదనపు పింఛన్‌ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు అభినందించారు.



Updated Date - 2021-07-28T06:43:07+05:30 IST