మాట్లాడుతున్న జీఎం జగదీశ్వరరావు
జీఎం జగదీశ్వరరావు
ఉదయగిరి రూరల్, జనవరి 28: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు అందిస్తున్న సేవలను బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది అవగాహన కల్పించి విస్తృతపరచాలని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ జగదీశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకులో ఉదయగిరి ప్రాంతంలోని బ్యాంక మేనేజర్లతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిపాజిట్లు, పొదుపు ఖాతాలపై ఏ బ్యాంకు ఇవ్వని విధంగా తమ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందన్నారు. మేనేజర్లు, సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటికెళ్లి బ్యాంకు అందించే సేవలను వివరించాలన్నారు. మార్చి నెలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది డిపాజిట్ల సేకరణ చేపట్టాలన్నారు. కెరీర్ సమృద్ధి నూతన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మేనేజర్లకు కేటాయించిన లక్ష్యాలను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శేలేంద్రనాథ్, చీఫ్ మేనేజర్ పీవీ రమణ, ఉదయగిరి, గండిపాళెం, నందిపాడు, నర్రవాడ, వింజమూరు, చాకలికొండ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.