Abn logo
Sep 16 2021 @ 23:36PM

ఏపీజీబీ రూ.5వేల కోట్ల వ్యాపారం

సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ రాకేష్‌కశ్యప్‌

నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 16 : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రూ.5వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆ బ్యాంకు చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ చెప్పారు. నగరంలోని ఆంధ్ర మహాసభలో ఖాతాదారుల సమావేశం గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉందన్నారు. అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ అందిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురికి రుణ మంజూరు లేఖలు అందచేశారు.  ఈ సమావేశంలో ఆర్‌ఎం కోటేశ్వరరావు, చీఫ్‌ మేనేజర్‌ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. కాగా,  చైర్మన్‌ రాకేష్‌ కశ్వప్‌ మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను బంగ్లాలో కలిశారు.