నిరంతరం ప్రజలకు అందుబాటులో ఏపీజీబీ

ABN , First Publish Date - 2020-06-01T09:12:02+05:30 IST

నిరంతరం అందుబాటులో ఏపీజీబీ ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నదని బ్యాంకు చైర్మన్‌ ఏ.వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.31,828 కోట్ల

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఏపీజీబీ

బ్యాంకు చైర్మన్‌ వెంకట్‌రెడ్డి


కడప(సిటీ), మే 31: నిరంతరం అందుబాటులో ఏపీజీబీ ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నదని బ్యాంకు చైర్మన్‌ ఏ.వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.31,828 కోట్ల వ్యాపారంతో ఇతర బ్యాంకుల కంటే ముందు వరుసలో ఉందని రైతులకు, స్వయం సహాయక బృందాలు సహా ఇతర అన్ని వర్గాల వారికి విరివిగా రుణాలను మంజూరు చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామిగా కొనసాగుతున్నదన్నారు.


అనంత, రాయలసీమ, పినాకినీ గ్రామీణ బ్యాంకుల సమ్మేళనంతో 1-06-2006న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఏర్పడిందని, నేటితో 14వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. అంతేకాక తమ సిబ్బంది తమ ఒక రోజు వేతనం కింద రూ.50 లక్షలు ఏపీ ప్రభుత్వం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా అందజేసామన్నారు. కరోనా కారణంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-01T09:12:02+05:30 IST