అపెక్స్ భేటీకి డుమ్మా కోసమే... అదే రోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారా ?

ABN , First Publish Date - 2020-08-02T00:49:11+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల ఐదవ తేదీన జరగనుంది. ఆ రోజు... మధ్యాహ్నం రెండుగంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం జరుగుతుంది. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

అపెక్స్ భేటీకి డుమ్మా కోసమే... అదే రోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారా ?

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల ఐదవ తేదీన జరగనుంది. ఆ రోజు... మధ్యాహ్నం రెండుగంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం జరుగుతుంది. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే... అదే రోజు(ఐదవ తేదీ)న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో… అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగాల్సి ఉంది. ఈ తేదీని ఖరారు చేసిన కేంద్రం... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం సమాచారం పంపింది. కాగా... ఈ భేటీ పట్ల కేసీఆర్ అంతగా సుముఖంగా లేరని సమాచారం.


అపెక్స్ కౌన్సిల్ భేటీని వాయిదా వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేసినట్లు వినవస్తోంది. ఈ విజ్ఞప్తిని... కేంద్రం అంగీకరిస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే... కేసీఆర్... వ్యూహాత్మకంగా కేబినెట్ భేటీని అదే రోజున ఏర్పాటు చేశారన్న చర్చ జరుగుతోంది. 


Updated Date - 2020-08-02T00:49:11+05:30 IST