ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏపీసీపీఎస్‌ఈఏ అభ్యర్థి

ABN , First Publish Date - 2022-10-07T05:18:39+05:30 IST

త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తా ము అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు ఆంధ్రప్ర దేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల అప్పలరాజు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏపీసీపీఎస్‌ఈఏ అభ్యర్థి
పీలేరులో మాట్లాడుతున్న అప్పలరాజు

పీలేరులో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు 

పీలేరు, అక్టోబరు 6: త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తా ము అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు ఆంధ్రప్ర దేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల అప్పలరాజు పేర్కొన్నారు. ఏపీసీపీఎస్‌ ఈఏ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యాల యాన్ని విజయదశమి సంద ర్భంగా బుధవారం ఆయన పీలేరులో ప్రారం భించి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రస్తుతమున్న ఎమ్మెల్సీలెవ్వరూ సరైన పద్ధతి లో ప్రభుత్వంపై పోరాడలేదన్నారు. ఆ లోటును పూడ్చుకునేందుకు సీపీఎస్‌ ఎంప్లా యీస్‌ తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. తూర్పు, పశ్ఛిమ రాయ లసీమ ఎమ్మెల్సీ పరిధిలోని ప్రతి సీపీఎస్‌ ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తెరిగి తాము నిలబెట్టే అభ్యర్థిని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామాంజనే యులు యాదవ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల పోరాటల ఫలితంగా పక్క రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేస్తుంటే ఏపీ ప్రభుత్వం మా త్రం ఎటువంటి చట్టబద్ధత లేని జీపీఎస్‌ను తెర మీదుకు తేవడం దారుణమ న్నారు.  ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్‌, నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డిరమేశ్‌, సీపీఎస్‌ఈఏ నాయకులు మురళీమోహన్‌, శ్రీనివాసులు, శ్రీధర్‌ కుమార్‌, రంజిత్‌ కుమార్‌, అశోక్‌ రెడ్డి, వెంకటరమణ, కిశోర్‌ కుమార్‌, వినోద్‌, జయప్రకాశ్‌, మధు, మహేశ్‌ బాబు, ఈశ్వరయ్య, సుబ్రహ్మణ్యం పాల్గొ న్నారు. 


Updated Date - 2022-10-07T05:18:39+05:30 IST