ఆ విధానాన్ని ఉపసంహరించుకోండి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-09-01T23:24:38+05:30 IST

అమరావతి: కుటుంబంలో ఒకే పింఛన్ విధానాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ సాకులు చూపిస్తూ

ఆ విధానాన్ని ఉపసంహరించుకోండి: తులసిరెడ్డి

అమరావతి: కుటుంబంలో ఒకే పింఛన్ విధానాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ సాకులు చూపిస్తూ పింఛన్లలో కోత పెట్టడం సరైంది కాదన్నారు. తద్వారా చాలా మంది వృద్ధులు, వికలాంగుల జీవనం దెబ్బతింటుందని చెప్పారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగాదారులపై రూ.3,669 కోట్లు అదనపు భారం మోపారని ఆరోపించారు. ఏరు దాటక ముందు ఏటి మల్లన్న.. దాటాకా బోడి మల్లన్న.. అన్న రీతిలో జగన్ ప్రభుత్వం పని చేస్తోందని ఎద్దేవా చేశారు.


అధికారంలోకి వస్తే  విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి.. మాట తప్పారని విమర్శించారు. గత ఏడాది రూ.2,800కోట్ల భారం మోపారని తెలిపారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త టారిఫ్ ఆర్డర్ పేరుతో రూ.2,600 కోట్ల భారం మోపారని వివరించారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయని.. అసలే కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. ఇలా అదనను భారం మోపడం దుర్మార్గమని తెలిపారు. ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో మళ్లీ రూ.3,669 కోట్ల అదనపు భారం వేయడం అమానుషమని చెప్పారు. ఎపీ ప్రభుత్వ విధానాలు.. పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-01T23:24:38+05:30 IST