కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-05-11T05:43:26+05:30 IST

కరోనా మహమ్మారి నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

గుంటూరు, మే 10: కరోనా మహమ్మారి నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి విమర్శించారు. రాజీవ్‌గాంధీభవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కొవిడ్‌ నివారణలో రెండు ప్రభుత్వాలు విఫలమై చోద్యం చూస్తున్నాయన్నారు.  కరోనా బాదితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవటంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు జక్కా శ్రీనివాసరావు, తవిడిశెట్టి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T05:43:26+05:30 IST