అమరావతి: వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ విధానాలు, జగన్ రెడ్డి నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి విఘాతంగా మారాయని ఆయన మండిపడ్డారు. పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నదని ఆయన ఆరోపించారు. ఉద్యోగస్తులను దగా చేసిన చరిత్ర కూడా ఈ ప్రభుత్వానిదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి