చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2022-08-20T07:11:06+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 19 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు. శుక్రవారం స్థానిక రవి హైస్కూల్‌లో స్వాతంత్య్ర వజ్రోత్స వాల్లో భాగంగా ఫ్రీడమ్‌ కప్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 19 మండలాలకు చెందిన విద్యా ర్థులు పలుక్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... ఉత్తేజపరిచారు. జాతీయభావం పెంపొందించుకొని ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తమవంతు కృషి సలపాలని పిలుపు నిచ్చారు. అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, చైర్మన్‌ ఈశ్వర్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, ఎమ్మార్వో సుభాష్‌చంద్ర, కరస్పాండెంట్‌ ఏ. వెంకటేశ్వర్‌ రావు పాల్గొన్నారు. 

వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్‌

నిర్మల్‌టౌన్‌, ఆగస్టు 19 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్ర వారం డీఆర్డీవో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌ వృద్ధులతో మాట్లాడుతూ... రోజువారీ కార్యక్రమం ఎలా సాగుతున్నాయి. ఏమైనా సమస్యలున్నాయా అని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించాలని, అలాగే వారిని ఆహ్లాదకరమైన వాతా వరణంలో గడి పేలా పార్కులకు తీసుకువెళ్లాలని, ప్రత్యేకశ్రద్ధ తీసు కోవాలని డీఆర్డీవో విజయలక్ష్మికి సూచించారు. అనంతరం దివ్యాంగుల, వయోవృద్ధుల హెల్ఫ్‌లైన్‌ గోడపత్రులను ఆవిష్కరణ, దివ్యాంగుల హెల్ఫ్‌లైన్ల టోల్‌ ఫ్రీ నెంబర్‌ గోడపత్రులను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల అభి వృద్ధికి మ్యారేజ్‌ ఇన్సెంటివ్‌ అవార్డుల పథకం ఆర్థిక సౌవలంబన  ఈఆర్‌ ఎస్‌, వారికి ఉపకరణాలు అందించడంలో కృషి చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందుతూ స్వేచ్ఛాయుత గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, దివ్యాంగుల సాధికారత కోసం వారికి విద్య, ఉపాధి అవ కాశాలు, ఆరోగ్య భద్రత, మౌళిక వస్తువుల కోసం బహుముఖ పద్ధతుల్లో కృషి చేస్తున్నామన్నారు. వృద్ధులను వేధిస్తే, పోషణ పరంగా చూసుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వయోవృద్ధులపై వేధింపులు జరిగినప్పుడు హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ 14567కి కాల్‌ చేస్తే సంబంఽ దిత అధికారులు వచ్చి తగు చర్యలు తీసుకుంటారని, దివ్యాంగుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 18005728980కి కాల్‌ చేస్తే సంబంధిత అధికారులు తగిన సహాయం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, సీడీపీవో జూనియర్‌ అసిస్టెంట్‌, సంక్షేమశాఖ ఫీల్డ్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్స్‌ మధుసూదన్‌, తదితరులు పాల్గొన్నారు. 

బాసరలో 

చిరుత కలకలం!? 

ఫ ట్రిపుల్‌ ఐటీ సమీపాన పంట పొలాల్లో 

     కనిపించినట్లు స్థానికుల వెల్లడి 

ఫ పులి కాదు.. తోడేలు కావొచ్చన్న అటవీ 

     శాఖాధికారులు 

బాసర, ఆగస్టు 19 : బాసరలో శుక్రవారం చిరుత పులిసంచారం కలకలం రేపింది. ట్రిపుల్‌ ఐటీ సమీ పంలో గల పంట పొలాల్లో చిరుతపులి కనిపించినట్లు ఫేరోజ్‌ఖాన్‌ అనే వ్యక్తి చెప్పడంతో.. అంతటా ఆం దోళన మొదలైంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కోళ్లను తీసుకొని ద్విచక్ర వాహ నంపై వెళుతుండగా చిరుతపులి దాడి చేసే ప్రయత్నం చేసినట్లు ఫేరోజ్‌ఖాన్‌ చెప్పాడు. సమాచారం అందు కున్న అటవీ శాఖాధికారులు వెంటనే ఘటనాస్థలికి పరిశీలించారు. కొన్నిచోట్ల చిరుత వేలిముద్రలను పోలి ఉండడంతో.. స్థానికుల్లో మరింత ఆందోళన మొద లైంది. కాగా.. అటవీ శాఖాధికారులు మాత్రం అవి చిరుత వేలిముద్రలు కావని, తోడేళ్లవి కావొచ్చని అ నుమానం వ్యక్తం చేశారు. కాగా.. చిరుత సంచారంపై స్థానికంగా పెద్దఎత్తున ప్రచారం జరగడంతో.. శుక్ర వారం వ్యవసాయదారులు, కూలీలు పనులు చేసేం దుకు వెళ్లలేదు. 

గుడుంబా రహిత మండలంగా చేయాలి

మామడ, ఆగస్టు 19 : గుడుంబా రహిత మండలంగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఎక్సైజ్‌ ఎస్సై సులోచన అన్నారు. శుక్రవారం రోజున రాయదారి తండా, మామల తండా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న వారిని పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం మామడ వైన్స్‌ను తనిఖీ చేశారు. రికార్డులను, మద్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గుడుంబా అమ్మినా, కాచినా చట్టరీత్యా నేరమని, చర్యలు తీసుకుంటామని అన్నారు. గుడుంబా అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో యువత మత్తును వీడాలని లేకుంటే భవి ష్యత్తు నాశనం అవుతుందన్నారు. రాయదారి తండా, మామల తండాకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

యథేచ్చగా గుట్కా విక్రయాలు

ఫ పట్టించుకోని సంబంధిత అధికారులు

కుభీర్‌, ఆగస్టు 19 : గ్రామాల్లో గుట్కా విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఒక వైపు సంబంధిత అధికారులు దాడులు చేస్తన్న అక్రమ ఆదాయానికి అలవాటు పడిన కొందరు వారి గుట్కా సేవలు విస్తరిస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గుట్కా విక్రయం గుట్టు చప్పుడు కాకుండా సాగు తున్నాయి. వినియోగదారుల అవసరాలను గుర్తించి  వ్యాపారులు అక్రమ వ్యాపారాన్ని గ్రామాల్లోకి విస్తరి స్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వివిధ లోడు వాహనాల్లో అడుగున సరుకు ఉంచి గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తరలిస్తున్నారు. ఆటోల్లో గ్రామా శివారు ప్రాంతాలకు అర్థరాత్రి వేళ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై సరుకును తీసుకెళ్లి రహస్య స్థావరాల్లో భద్రపరిచి అమ్మకాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు నామమాత్రంగా దాడులు జరుపుతూ, ఏమి పట్టనట్లుగా వ్యవ హరించడంపై మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయిన సంబంధిత అధికారులు స్పందించి గుట్కా విక్రయాలపై దృష్టి సారించా లంటున్నారు.

Updated Date - 2022-08-20T07:11:06+05:30 IST