పోకిరి ప్రత్యేక షోలో అపశ్రుతి

ABN , First Publish Date - 2022-08-11T04:33:51+05:30 IST

అభిమానం హద్దుమీరింది. ప్రతిఫలం గా సినిమా థియేటర్‌లో స్ర్కీన్‌ చిరిగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సినీ హీరో మహే్‌షబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోకిరి ప్రత్యేక షోలు నిర్వహించారు. ఈక్రమంలోనే చీరాల శాంతి ఽథియేటర్‌లో ఫస్ట్‌ షో, సెకండ్‌ షో నిర్వహించారు.

పోకిరి ప్రత్యేక షోలో అపశ్రుతి
శాంతి థియేటర్‌లో చిరిగిపోయిన స్ర్కీన్‌ను పరిశీలిస్తున్న యాజమాన్యం

చిరిగిపోయిన స్ర్కీన్‌    షో నిలిపివేత

చీరాలటౌన్‌, ఆగస్టు 10 : అభిమానం హద్దుమీరింది. ప్రతిఫలం గా సినిమా థియేటర్‌లో స్ర్కీన్‌ చిరిగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సినీ హీరో మహే్‌షబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోకిరి ప్రత్యేక షోలు నిర్వహించారు. ఈక్రమంలోనే చీరాల శాంతి ఽథియేటర్‌లో ఫస్ట్‌ షో, సెకండ్‌ షో నిర్వహించారు. అయితే విశేషంగా రెండు ఆటలు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఈక్రమంలో సెకండ్‌ షో ఆట మధ్యలో ఓ పాట సమయంలో అభిమానులు స్ర్కీన్‌ దగ్గరకు అఽధిక సంఖ్యలో చేరి సందడి చేశారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు తెరపై పడటంతో స్ర్కీన్‌ చిరిగింది. దీంతో ఽథియేటర్‌ యాజమాన్యం షో నిలిపి వేయడంతో అందరూ నిరుత్సాహంగా వెళ్లిపోయారు

Updated Date - 2022-08-11T04:33:51+05:30 IST