నరసాపురంలో రేపటి నుంచి స్పందన

ABN , First Publish Date - 2021-07-25T05:13:40+05:30 IST

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సబ్‌కలెక్టర్‌ విష్టుచరణ్‌ చెప్పారు.

నరసాపురంలో రేపటి నుంచి స్పందన

నరసాపురం, జూలై 24: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సబ్‌కలెక్టర్‌ విష్టుచరణ్‌ చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. సబ్‌డివిజన్‌ పరిధిలోని పట్టణ, మండలాలకు చెందిన వారు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకో వచ్చునన్నారు.కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్పందనకు హాజరవ్వాలన్నారు.

Updated Date - 2021-07-25T05:13:40+05:30 IST