కొవిడ్‌ బాధితుల పాలిట ఆపద్బాంధవులు ఆ దంపతులు

ABN , First Publish Date - 2021-05-16T06:05:31+05:30 IST

కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడుతుంటారు. కనీసం కడచూపుకు వెళ్లడానికి కూడా భయపడుతున్నవారు ఉన్నారు. కానీ కొవిడ్‌ బాధితుల పాలిట ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు పట్టణంలోని పండరీపురం 8వ లైనుకు చెందిన రావూరి నరసింహారావు, లక్ష్మితులసి దంపతులు.

కొవిడ్‌ బాధితుల పాలిట ఆపద్బాంధవులు ఆ దంపతులు
ఆహారం తయారు చేస్తున్న రావూరి లక్ష్మితులసి

చిలకలూరిపేట టౌన్‌, మే 15 : కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడుతుంటారు. కనీసం కడచూపుకు వెళ్లడానికి కూడా భయపడుతున్నవారు ఉన్నారు. కానీ కొవిడ్‌ బాధితుల పాలిట ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు పట్టణంలోని పండరీపురం 8వ లైనుకు చెందిన రావూరి నరసింహారావు, లక్ష్మితులసి దంపతులు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారి ఇళ్లకు ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణ పరిధిలో కరోనా సోకి ఆహారం వండుకోలేని వారికోసం ఉచితంగా ఉదయం, సాయంత్రం భోజనం డెలివరీ చేస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. మంచి ఆరోగ్యకర భోజనంతోపాటు ఉడకబెట్టిన గుడ్డు, శనగలు, నాలుగు రకాల కూరలు అందజేస్తున్నారు. కరోనా భారిన పడి భోజనం  వండుకోలేనివారు ఫోన్‌ నంబర్లు  7989192702, 9963837151. ఉదయం 8 గంటలకల్లా ఫోన్‌ చేసి తెలియజేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఇంటికి అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని కొవిడ్‌ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-16T06:05:31+05:30 IST