అమరావతి: ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవోకి రెండు వారాల జైలు శిక్షను హైకోర్టు విధించింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంని కొంత భూమి వక్ఫ్ బోర్డు జాబితాలో ఉండడంతో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను వక్ఫ్ బోర్డు అమలు చేయలేదు. దీంతో వక్ఫ్ బోర్డు సీఈవోకి రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానాను ధర్మాసనం విధించింది. తీర్పు అమలును రెండు వారాలపాటు ఏపీ హైకోర్టు నిలిపివేసింది.