సినిమా థియేట‌ర్లు vs ఏపీ ప్ర‌భుత్వం

ABN , First Publish Date - 2021-12-27T17:18:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయం హీట్ పుట్టించింది. ఫిలిమ్ ఇండస్ట్రీ.. పొలిటికల్ ఇండస్ట్రీ మధ్య...

సినిమా థియేట‌ర్లు vs ఏపీ ప్ర‌భుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయం హీట్ పుట్టించింది. ఫిలిమ్ ఇండస్ట్రీ.. పొలిటికల్ ఇండస్ట్రీ మధ్య టాక్స్ పేయర్స్ వార్ ముదిరి పాకానపడింది. థియేటర్లకు తాళాలు పడడంపై అధికార వైసీపీ మంత్రులు, నేతలు తమకు ప్రేక్షకుల ప్రయోజనాలే ముఖ్యమనే వాదన వినిపిస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీని బజారున పడేసే ప్రయత్నాలు మానుకోకుంటే మున్ముందు సినిమా చూసే భాగ్యం కూడా ఉండదని సినీ పెద్దలు వాపోతున్నారు.


తెలుగు సినిమా పుట్టినిల్లు ఏపీలో చిత్రసీమకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇండస్ట్రీని నమ్ముకున్నవాళ్లకు జగన్ ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. థియేటర్లు మూతపడడంతో ఏపీలో ఏం జరుగుతోందన్న ప్రశ్న సామాన్యుడిలో మొదలైంది. దీనిపై అధికార వైసీపీ తన వాదన తాను చెబుతుండగా.. ప్రతిపక్షాలు, చిత్రసీమకు సంబంధించిన వ్యక్తులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కష్టానికి తగినట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ప్రభుత్వానికి టాక్సులు కడుతున్న ఇండస్ట్రీపై మమూళ్లకు, లంచాలకు అలవాటుపడి దొంగసొమ్ము కూడబెట్టుకుంటున్న కొందరు రాజకీయ నేతలు అడ్డంపడడం ఏంటని హీరోలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-12-27T17:18:40+05:30 IST