నేను, కొల్లు రవీంద్ర బీసీలుగా పుట్టడం తప్పా..? : అచ్చెన్న

ABN , First Publish Date - 2020-12-03T14:37:03+05:30 IST

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఎవరైతే ఓటువేసి గెలిపించారో

నేను, కొల్లు రవీంద్ర  బీసీలుగా పుట్టడం తప్పా..? : అచ్చెన్న

అమరావతి : 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఎవరైతే ఓటువేసి గెలిపించారో ఆయా వర్గాలపైనే ప్రస్తుతం రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరిగిన దాడులకు నిరసనగా నేడు వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ఆ వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలని అచ్చెన్న చెప్పుకొచ్చారు. 


బీసీలుగా ఉండటమే తప్పా..!

బీసీలుగా పుట్టడం నేను, కొల్లు రవీంద్ర చేసిన తప్పా.. అందుకే మా మీద కేసులు పెట్టారా..?. అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దాచిపెట్టడానికే మీరు కొన్ని మీడియాలను బంద్ చేస్తారా..? ముఖ్యమంత్రి మటాడితేనే లైవ్ వస్తోంది ప్రతిపక్ష నేత, సభ్యులు మటాడినప్పుడు లైవ్ కనపడనివ్వడం లేదు.శాసన సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలు తెలియకుండా కొన్ని మీడియాలను నియంత్రిస్తున్నారు. మీడియా సంస్థలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం. సలాం కుటుంబం ఆత్మహత్య, డాక్టర్ సుధాకర్ సహా దళితులపై దాడులపైన వాయిదా తీర్మానాన్ని అనుమతించి చర్చించాలి. కోవిడ్ ప్రపంచాన్ని వణికిస్తున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌లు కోవిడ్ సేవలు చేస్తే ఉద్యోగాలు ఇస్తామన్నారు. దీంతో డాక్టర్‌లు, నర్సులు, వైద్యాసిబ్బంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేశారు. ఇప్పుడు వీరి సేవలు చాలు అని చెబుతూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరి సేవలను ఔట్ సోర్సింగ్‌లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం అని అచ్చెన్నాయుడు మీడియా మీట్ వేదికగా వెల్లడించారు.

Updated Date - 2020-12-03T14:37:03+05:30 IST