ఒంగోలు: మహానాడును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. చీమల దండులా కార్యకర్తలు తరలివచ్చారని.. ఇది జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడు చూశాక 160 స్థానాలు ఖాయంగా కన్పిస్తోందన్నారు. ఏపీని ఓ క్రిమినల్ పాలిస్తున్నారని.. ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా అచ్చెన్న పిలుపు నిచ్చారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారని.. కులాలు, మతాల మధ్య తగువులు పెడతారని చెప్పారు. టీడీపీ గెలుపు ఖాయమని అర్థమయ్యాక.. కోనసీమలో తన మంత్రి ఇంటినే తగలపెట్టించారని తెలిపారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మొన్నటి వరకు జగన్‌ను తిట్టిన బొత్స, ధర్మాన ఇప్పుడు బస్సు యాత్రలో వచ్చి టీడీపీని విమర్శిస్తూ.. జగన్ జపం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి