జీతాలు ఇవ్వట్లేదని ఏపీ సెక్రటేరియట్ స్వీపర్స్ నిరసన

ABN , First Publish Date - 2020-08-07T00:33:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో పనిచేసే స్వీపర్స్ నిరసనకు దిగారు.

జీతాలు ఇవ్వట్లేదని ఏపీ సెక్రటేరియట్ స్వీపర్స్ నిరసన

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో పనిచేసే స్వీపర్స్ నిరసనకు దిగారు. గత నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వట్లేదని గురువారం నాడు స్వీపర్స్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ విధులు నిర్వహించినా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని.. తక్షణమే తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని స్వీపర్స్ డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఉన్నతాధికారులు జీతాల విషయమై ప్రభుత్వంతో చర్చించి జీతాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


కాగా.. వెలగపూడిలోని మందడంలో ‘మూడు రాజధాని వద్దు.. ఒకటే రాజధాని కావాలి’ అని రాజధాని రైతులు నిరసన చేపట్టారు. ఆ శిబిరాలకు పక్కనే సచివాలయానికి వెళ్లే రోడ్డుపై స్వీపర్స్ కూడా నిరసన చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Updated Date - 2020-08-07T00:33:18+05:30 IST