‘విలీన’ వ్యధలు!

ABN , First Publish Date - 2022-05-16T06:51:09+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను గత విద్యాసంవత్సరంలో ప్రారంభించింది. దీనికి 250 మీటర్ల పరిధిని నిర్ణయించడంతో ఆ పరిధిలోని పాఠశాలలను విలీనం చేశారు. విలీన ఉన్నత పాఠశాలల్లో వసతి సరిపోకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లోనే ఆ విద్యార్థులకు బోధన సాగించాల ని తొలుత ఉత్తర్వు లు ఇచ్చారు. దీంతో పా ఠశాల విలీనమైనా ప్రాథమిక పాఠశాలలోనే 3,4,5 తరగతుల విద్యార్థులకు బోధన సాగించారు. కొద్దిచోట్ల మినహా మి గిలిన చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

‘విలీన’ వ్యధలు!

జిల్లాలో 1130 పాఠశాలల విలీనానికి రంగం సిద్ధం

250 మీటర్ల నుంచి కిలోమీటరుకు పరిధి పెంపు

గతేడాది విలీన పాఠశాలలకు నేటికీ సమకూరని వసతులు

ఇప్పటికే సౌకర్యాలు చాలక సతమతమవుతున్న ఉన్నత పాఠశాలలు

3, 4, 5 తరగతుల విలీనంతో మరింతగా అవసరం కానున్న వసతులు

నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యేదెన్నటికో

క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోకుండా విలీనానికే మొగ్గు

ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

జాతీయ నూతన విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీన ప్రక్రియ బాలారిష్టాలతో సతమతమవుతోంది. అయినా దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మరింతగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. చాలాచోట్ల గతేడాదే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాల్లో సర్దుబాటు చేశారు. ఇది ఇబ్బంది అయినప్పటికీ ఏదోలా విద్యాసంవత్సరం గడిచింది. ఇప్పుడు ఇది మరింత పెరిగి విలీన విద్యార్థుల సంఖ్య ఇంకా పెరగనుంది. సరైన సౌకర్యాలు కల్పించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పైగా ఇంటినుంచి ఆయా పాఠశాలలు దూరంగా ఉండడంతో రహదారులపై విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అనే మీమాంసలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పాఠశాలల విలీనం వెనుక ఇన్ని చిక్కుముడులు ఉన్నాయి. దీనిపై ప్రత్యేక కథనం..

తుని, మే 15: ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను గత విద్యాసంవత్సరంలో ప్రారంభించింది. దీనికి 250 మీటర్ల పరిధిని నిర్ణయించడంతో ఆ పరిధిలోని పాఠశాలలను విలీనం చేశారు. విలీన ఉన్నత పాఠశాలల్లో వసతి సరిపోకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లోనే ఆ విద్యార్థులకు బోధన సాగించాల ని తొలుత ఉత్తర్వు లు ఇచ్చారు. దీంతో పా ఠశాల విలీనమైనా ప్రాథమిక పాఠశాలలోనే 3,4,5 తరగతుల విద్యార్థులకు బోధన సాగించారు. కొద్దిచోట్ల మినహా మి గిలిన చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తిరిగి ప్రాథమిక పాఠశాలలనుంచి వచ్చిన విద్యార్థులకు ఉన్నత పాఠశాలల్లోనే బోధన చేయాలని, వసతి ఉన్నా లేకపోకయినా అక్కడికే తరలివెళ్లాలని అధికారులు సూచించడంతో వారంతా ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. తీరా అక్కడకు వెళ్లాక వసతి లేకపోయినప్పటికీ అక్కడే విద్యాసంవత్సరం మొత్తం ముగించారు.

వాళ్లకే లేదు.. వీళ్లనెలా సమకూర్చేది..?

విలీనమైన కొద్ది పాఠశాలలకే వసతి లేని నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా నుంచి 1130 పాఠశాలల విలీనానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అనేక ఉన్నత పాఠశాలల్లో ఇప్పుడు ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులకే వసతి లేక సతమతమవుతున్నారు. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీషు మీడియం కూడా ఉండడంతో రెండు మీడియం విద్యార్థులను ఒకే తరగతి గదిలో ఉంచి బోధన సాగించాల్సిన పరిస్థితి చాలాచోట్ల ఉంది. మరికొన్నిచోట్ల వరండాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు కూడా భారీసంఖ్యలో ఉన్నత పాఠశాలలకు వస్తే వారికి వసతి ఎలా సమకూరుస్తారో అర్థం కాకుండా ఉంది.


పూర్తికాని తరగతి గదుల నిర్మాణం

విలీన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాడు-నేడు రెండో విడతలో తరగతి గదులు మంజూరు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ మంజూరైన తరగతి గదుల నిర్మాణం ఇంకా ఎంవోయు దశను దాటి నిర్మాణ దశకు చేరుకోలేదు. జూలై 4 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికి భవనాల నిర్మాణం పూర్తవతుందాఅన్నది ప్రశ్నార్థకమే.

ఇంటినుంచి దూరం.. ఏదైనా ప్రమాదం జరిగితే?

మరోవైపు కిలోమీటరు దూరం నుంచి పసిపిల్లను దూరప్రాంతాలకు పంపేందుకు తల్లిదండ్రుల నుంచి సముఖత వ్యక్తం కావడం లేదు. పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు దూరాన్ని లెక్కిస్తున్నారని, ఇంటి దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాలకు రావడానికే ఎక్కువ దూరం రావాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు ఇంత దూరం పసిపిల్లను పంపడంవల్ల రహదారుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అరకొర సౌకర్యాలు, సిబ్బందితో హడావుడిగా విలీనం చేసే బదులు అన్ని సౌకర్యాలు కల్పించాక తరగతులు తరలిస్తే ఇబ్బంది ఉండదని పలువురు పేర్కొంటున్నారు. లక్షలు వెచ్చించి అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రాథమిక పాఠశాలలు ఇకపై అంగన్వాడీల ఆధ్వర్యంలో పి.పి.1, పి.పి2  ప్రిపరేటివ్‌ ఫస్ట్‌ క్లాస్‌తోపాటు ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి.

Updated Date - 2022-05-16T06:51:09+05:30 IST