ఏపీలో 9 నుంచి పాఠశాలలకు సెలవులు

ABN , First Publish Date - 2021-10-06T17:31:03+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 17 వరకు సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో 9 నుంచి పాఠశాలలకు సెలవులు

విజయవాడ: రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 17 వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11 నుంచి 16 వరకు దసరా సెలవులు కాగా...తొమ్మిదో తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో అదనంగా సెలవులు వచ్చాయి. దీంతో ఎనిమిదో తేదీ వరకే పాఠశాలలు పనిచేస్తాయి. 17న ఆదివారం రావడంతో 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన 9వ తేదీ నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. 

Updated Date - 2021-10-06T17:31:03+05:30 IST