ఏపీలో కరోనా కేసులతో పాటు పెరిగిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-08-06T02:11:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో బుధవారం కొత్తగా...

ఏపీలో కరోనా కేసులతో పాటు పెరిగిన కరోనా మరణాలు

ఏపీలో కొత్తగా 10,128 కరోనా కేసులు, 77 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో బుధవారం కొత్తగా 10,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు హెల్త్ బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 80,426 కాగా.. 1,04354 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ కొత్తగా నమోదైన కరోనా కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1544 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 1368 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో 1260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


మిగతా జిల్లాల విషయానికొస్తే.. విశాఖపట్నం 842, గుంటూరు 730, కడప 729, చిత్తూరు 677, విజయనగరం 665, పశ్చిమ గోదావరి 582, కృష్ణా 440, శ్రీకాకుళం 405, ప్రకాశం జిల్లాలో 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.


ఏపీలో కరోనా వల్ల ఇవాళ ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 16 మంది, విశాఖపట్నం జిల్లాలో 12 మంది, శ్రీకాకుళం 10, చిత్తూరు 8, తూర్పుగోదావరి 7, కృష్ణ 5, నెల్లూరు 4, కర్నూలు 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 3, అనంతపురంలో 2, కడప 2, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే ఏపీలో కరోనా వల్ల 77 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 8,729 మంది ఏపీలో కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 



Updated Date - 2020-08-06T02:11:57+05:30 IST