కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన!

ABN , First Publish Date - 2021-11-17T03:21:41+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గురువారానికి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. బుధవారం కోస్తాంధ్రలో..

కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన!

విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. గురువారానికి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాయలసీమలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. గురువారానికి దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.  గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులు చేసుకునే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-11-17T03:21:41+05:30 IST