Ap Railway Zone: కేంద్రం మరోమారు పిల్లి మొగ్గలు

ABN , First Publish Date - 2022-07-26T03:48:32+05:30 IST

ఏపీ రైల్వే జోన్‌పై మరోమారు కేంద్రం పిల్లి మొగ్గలు వేసింది. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని..

Ap Railway Zone: కేంద్రం మరోమారు పిల్లి మొగ్గలు

న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ రైల్వే జోన్ (Ap Railway Zone)పై మరోమారు కేంద్రం పిల్లి మొగ్గలు వేసింది. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని.. కానీ ఎప్పుడో చెప్పలేమంటూ చేతులెత్తేసింది. పార్లమెంట్ (parliament) హామీల అమలు పర్యవేక్షణ కమిటీ జాబితా నుంచి రైల్వే జోన్ అంశాన్ని తొలగించాలని కోరింది. రైల్వే జోన్ ఏర్పాటుపై గతంలో లోక్ సభ సాక్షిగా అప్పటి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) హామీ ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మూడు నెలల్లో అమలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే కోవిడ్ (Covid) తర్వాతి పరిణామాలు సంక్షిష్ట పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే జోన్ ఏర్పాటుకు సమయం పడుతుందని తెలిపింది. అందుకే హామీల జాబితా నుంచి  రైల్వే జోన్ అంశాన్ని తొలిగించాలని పార్లమెంట్ హామీల అమలు పర్యవేక్షణ కమిటీని కేంద్రం కోరింది. 




Updated Date - 2022-07-26T03:48:32+05:30 IST