Abn logo
Sep 19 2021 @ 20:15PM

ఏపీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం బంద్‌!

అమరావతి: ఏపీలో అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల నిధుల‌తో న‌డిచే ప్రాజెక్టుల‌కు ఇక ఆర్థిక సాయం బంద్‌ కానుంది. ఈ ప్రాజెక్టుల కింద విడుద‌ల చేసిన రూ.960 కోట్లకు లెక్క‌లు చెప్పాల‌ని డిపార్ట్‌మెంట్ ఎకాన‌మిక్ అఫైర్స్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ రాసిన లేఖ‌పై కేంద్ర ఆర్థిక శాఖ‌ తీవ్రంగా స్పందించింది. గ‌త వారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి ఘాటు లేఖ‌ వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వ‌స్తున్న నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డంపై కేంద్ర ఆర్థిక శాఖ‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రూ.960కోట్ల‌కు లెక్క‌లు చెప్ప‌కపోతే భ‌విష్య‌త్తులో నిధులు విడుద‌ల చేయ‌బోమ‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు స్ప‌ష్టం చేశాయి. ఈ ప్రాజెక్టుల కింద చేప‌ట్టిన ప‌నుల‌కు సంబంధించిన బిల్లులను ఇవ్వ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల‌కు కాంట్రాక్ట‌ర్లు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుతో అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు తీవ్రంగా స్పందించాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వానికి ఆర్థిక సంస్థ‌లు లేఖ రాశాయి. ఈ ప‌రిస్థితి తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన కేంద్ర ఆర్థిక శాఖ‌ త‌మ‌కు వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఏపీ ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌కు లేఖ‌ రాసింది. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...