Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రివిలేజ్ కమిటీ ముందుకు అచ్చెన్న

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అచ్చెన్నకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి గత నెలలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలవల్ల హాజరుకాలేకపోతున్నానని అప్పుడు కమిటీకి లేఖ రాశారు. దీంతో మంగళవారం మరోసారి కమిటీ సమావేశమయింది. ఈ భేటీకి అచ్చెన్నాయుడు తప్పకుండా హాజరు కావాలని కమిటీ చెప్పడంతో ఆయన హాజరయ్యారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరికొంతమంది టీడీపీ నేతలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement