ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా

ABN , First Publish Date - 2020-02-17T01:27:38+05:30 IST

ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెస్‌ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా

అమరావతి: ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెస్‌ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవిరెడ్డిని ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. దేవిరెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లిలో జన్మించారు. ఆయన ఆంధ్రప్రభ ద్వారా జర్నలిజం వృత్తిని స్వీకరించారు. నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. ఆయన రాయలసీమ వెనుకబాటుపై అనేక రచనలు చేశారు. ‘‘సెవెన్ రోడ్స్ జంక్షన్’’ పేరుతో ఆయన రాసిన కాలమ్స్ అందరి మన్ననలు అందుకుంది. దేవిరెడ్డి 1990లో బీబీసీ రేడియోలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఏపీయుడబ్లూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు ఇదే సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల కోసం దేవిరెడ్డి కృషి చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దేవిరెడ్డి అంత్యంత సన్నిహితుడిగా పేరుంది.

Updated Date - 2020-02-17T01:27:38+05:30 IST