ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రభావం ఉంటుంది: ఉండవల్లి
ABN , First Publish Date - 2022-04-16T01:38:46+05:30 IST
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభావం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.
అమరావతి: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభావం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌రెడ్డికి పోలికలేదన్నారు. విభజన హామీలపై వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతోందని తప్పుబట్టారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నాయని తెలిపారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవన్నారు. జిన్నా టవర్ అసలు ఇష్యూ కానే కాదని కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.