బెజవాడలో బంజారాహిల్స్‌ పోలీసులు

ABN , First Publish Date - 2020-07-05T09:27:31+05:30 IST

హైదరాబాద్‌లో ఓ విల్లా వాచ్‌మన్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో హైదరాబాద్‌ నుంచి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామిక వేత్త, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)

బెజవాడలో బంజారాహిల్స్‌ పోలీసులు

  • వైసీపీ నేత పీవీపీ కోసం గాలింపు

విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఓ విల్లా వాచ్‌మన్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో హైదరాబాద్‌ నుంచి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామిక వేత్త, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) కోసం బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం బెజవాడకు వచ్చారు. పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఓ విల్లా విక్రయం అనంతరం తలెత్తిన వివాదంలో వాచ్‌మన్‌ను కిడ్నాప్‌ చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టు చేయడానికి ఇంటికి వెళ్లిన పోలీసులపైకి పీవీపీ పెంపుడు కుక్కలను వదిలిపెట్టారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నెల ఒకటో తేదీన విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో నూతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ పక్కన ప్రత్యక్షమయ్యారు. ప్రసార మాధ్యమాల ద్వారా  విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఆయన అనుచరులు, ఉద్యోగులను విచారిస్తున్నారు. 

Updated Date - 2020-07-05T09:27:31+05:30 IST