AP PECET నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-06-29T20:03:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి - ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీఈసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని గుంటూరులోని ఆచార్య నాగార్జున

AP PECET నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి - ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీఈసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్‌ ద్వారా బీపీఈడీ, యూజీడీపీఈడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


అర్హత: బీపీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయసు జూలై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. 

  • యూజీడీపీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయసు జూలై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 

  • ఏపీ పీఈసెట్‌ వివరాలు: 
  • ఇందులో ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ గేమ్‌ అనే రెండు విభాగాలు ఉంటాయి. 
  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌: దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు నిర్వహించే టెస్ట్‌లో 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుటింగ్‌ ద షాట్‌, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. మహిళలకు నిర్వహించే టెస్ట్‌లో 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుటింగ్‌ ద షాట్‌, 400 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు నిర్దేశించారు.
  • స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ గేమ్‌: దీనికి 100 మార్కులు నిర్దేశించారు. బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో అభ్యర్థి ఎంచుకొన్న దానిలో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • ఏపీపీఈసెట్‌లో అర్హత సాధించాలంటే పై రెండు విభాగాల్లో మొత్తమ్మీద 30 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.  
  • జిల్లా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల పోటీల్లో ప్రతిభ కనబరచినవారికి; ఎన్‌ఐఎస్‌ నుంచి ఏడాది వ్యవధిగల కోర్సులు పూర్తిచేసినవారికి; డిప్లొమా(యోగ/ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌/ స్పోర్ట్స్‌ సైన్స్‌/ స్పోర్ట్స్‌ జర్నలిజం/ఒలింపిక్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణులకు; అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో బేసిక్‌ కోర్సు చేసినవారికి ఇన్‌సెంటివ్‌ మార్కులు ఉంటాయి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19

ఏపీ పీఈసెట్‌ తేదీలు: ఆగస్టు 8 నుంచి

వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in

Updated Date - 2022-06-29T20:03:00+05:30 IST