Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఏపీ ధాన్యం లారీలు జిల్లాలోకి రావొద్దు’

- అధికారులకు కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశం 

- కూనవరం చెక్‌పోస్టు తనిఖీ


భద్రాచలం: ఏపీ నుంచి వచ్చే ధాన్యం లారీలను జిల్లాలోకి అనుమతించొద్దని కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ సునీల్‌దత్‌ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని కూనవరం రోడ్‌లోగల ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుసు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ నుంచి వచ్చే ప్రతీ ధాన్యం లారీలను క్షుణంగా తనిఖీ చేసి తెలంగాణలో దిగుమతి ఉంటే వెంటనే వెనక్కి పంపాలని సూచించారు. సరిహద్దు తనిఖీ కేంద్రంలో నిత్యం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ అనుదీప్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో అలసత్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement