Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 27 Mar 2022 02:32:54 IST

దొంగ లెక్కలపై సీబీఐ దర్యాప్తు చేయాలి

twitter-iconwatsapp-iconfb-icon
దొంగ లెక్కలపై  సీబీఐ దర్యాప్తు చేయాలి

దాణా స్కాం 66 కోట్లే.. ఇక్కడ 48 వేల కోట్లకు లెక్కల్లేవు

‘ప్రత్యేక బిల్లులు’ అన్నవి చెల్లనేరవు: యనమల

 దాణా కుంభకోణం 66 కోట్లే

 ఇక్కడ 48 వేల కోట్లకు లెక్కల్లేవు

 ‘ప్రత్యేక బిల్లులు’ అన్నవి చెల్లనేరవు

 ఇదే స్పీడ్‌లో అప్పులు తెస్తే మరో రెండేళ్లలో

 వార్షిక చెల్లింపులు లక్ష కోట్లకు చేరతాయి!

 విషయాలను చర్చిద్దామంటే 

 పీఏసీ సమావేశాన్ని జరగనీయకుండా 

      వాయిదా వేస్తున్నారు: యనమల


అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా చూపిస్తున్న వాటిలో రూ.48,000 కోట్లకు లెక్కలు లేవని కాగ్‌ సంస్థ ఎత్తిచూపడం చాలా తీవ్రమైన అంశం. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని మాజీ ఆర్థిక మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ‘‘బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణం విలువ రూ.66 కోట్లే. దానిపై సీబీఐ దర్యాప్తు జరిపితే అనేక మంది జైల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లకు లెక్కలు లేవని కాగ్‌ ఎత్తి చూపడాన్ని కేంద్రం తీవ్రంగా తీసుకోవాలి. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలి. ఈ డబ్బును తినేశారా? లేక ఏ మాయ చేశారా? తేలాలి. ఒకసారి కాదు.. నాలుగుసార్లు కాగ్‌ ఈ లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాని రాష్ట్ర ప్రభుత్వం చూపలేకపోయింది’’ అని వివరించారు. శనివారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక బిల్లులు అనే పేరుతో రూ.48 వేల కోట్ల చెల్లింపులు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోందని, కాని ప్రత్యేక బిల్లులు అనే పదమే ఖజానా నిబంధనల్లో లేదని చెప్పారు.  వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేయడంతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చోటు చేసుకొంటోంది ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే అప్పులు చేస్తూ పోతే వచ్చే రెండేళ్లలో రాష్ట్రం అప్పులు రూ.తొమ్మిది లక్షల కోట్లకు చేరతాయి. ఇప్పుడే వడ్డీ, అసలు కలిపి ఏడాదికి రూ.31 వేల కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. అప్పులు రూ.9 లక్షల కోట్లకు చేరితే తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఏడాదికి రూ.లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యపడనక్కర లేదు’’ అని వ్యాఖ్యానించారు.  ‘‘బయట మార్కెట్‌ నుంచి ఏడాదిలో రూ.55 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఏ బిల్లులూ చెల్లించడం లేదు. వీటిపై చర్చించడానికి ప్రజా పద్దుల కమిటీ సమావేశం జరపాలి. దానిని జరపకుండా వాయిదాలు వేస్తున్నారు’’ అని యనమల విమర్శించారు.


‘‘ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయి రాష్ట్రం దివాళా దిశగా నడుస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ పతనం దిశగా తీసుకెళ్తోంది. మరింత పతనం కాకుండా ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలి.’’


‘‘ప్రభుత్వం వద్ద ఉండేది ప్రజల సొమ్ము. ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ నిబంధనలకు అనుగుణంగా లెక్క చూపించాల్సిందే. ప్రత్యేక బిల్లులనే పేరుతో ఎక్కడా లేని పదం ఒకటి సృష్టించి, ఖర్చు రాసేస్తే చెల్లదు. అందుకే కాగ్‌ ప్రశ్నించింది.’’

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.