Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

 పంట నష్టాలను పరిశీలించిన సభ్యులు 

తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం శుక్రవారం సాయంత్రం పర్యటించింది. దాదాపు 3 కి.మీ. మేర బీమా నది పరీవాహక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి వరద నష్టాలను సభ్యులు పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో వరద పాలైపోయిందని, మునకలో ఉన్న వరి, వేరుశనగ పంటలను భీమవరం రైతులు చూపించారు. భీమవరం, కూచివారిపల్లెల్లో పర్యటించిన కేంద్ర బృందం చీకటి పడిపోవడంతో తిరుపతికి చేరుకుంది. శనివారం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎన్డీఎంఏ అడ్వైజర్‌ కునాల్‌ సత్యార్థి, ఎఫ్‌సీడీ డైరెక్టర్‌ అభెయ్‌ కుమార్‌, డీజేడీ డైరెక్టర్‌ డాక్టర్‌ మన్మోహన్‌, జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసు బైరీ, శివాని శర్మ, శ్రవణ్‌ కుమార్‌సింగ్‌, అనిల్‌కుమార్‌ సింగ్‌తో పాటు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరుణ్‌కుమార్‌, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement