కోడికత్తి కేసుకు మూడేళ్లు

ABN , First Publish Date - 2021-10-27T09:02:55+05:30 IST

కోడికత్తి కేసుకు మూడేళ్లు

కోడికత్తి కేసుకు మూడేళ్లు

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై క్యాంటీన్‌ ఉద్యోగి దాడి

నిందితుడిని అరెస్టు చేసినపోలీసులు

హైకోర్టు ఆదేశంతో కేసు ఎన్‌ఐఏకు బదిలీ

దర్యాప్తు పూర్తి..  చార్జిషీట్‌ దాఖలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగి మూడేళ్లు పూర్తయింది. ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ 2019 ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తం గా పాదయాత్ర నిర్వహించారు. విజయనగరం జిల్లా లో పాదయాత్ర చేసి హైదరాబాద్‌ వెళ్లేందుకు 2018 అక్టోబరు 25 మధ్యాహ్నం 12.20 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీఐపీ లాం జ్‌లో పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. టీ తాగి, విమానం ఎక్కేందుకు వెళుతుండగా, విమానాశ్రయ క్యాంటీన్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం తానియాపాలేనికి చెందిన జనుపల్లి శ్రీనివాసరావు ఆయన వద్దకు వచ్చి తాను వైసీపీ అభిమానినంటూ మాటలు కలిపాడు. ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 160 సీట్లు రావడం, మీరు సీఎం అవడం ఖాయమన్నా’ అంటూ సెల్ఫీ తీసుకుంటానని కోరడంతో, జగన్‌ సరేనన్నారు. వెంటనే శ్రీనివాసరావు  తనతో తెచ్చుకున్న కోడికత్తిని బయటికి తీసి జగన్‌పై దాడి చేశాడు. జగన్‌ ఎడమ భుజంపై 0.5 సెంటీమీటర్లు లోతు, 0.5 సెంటీమీటర్లు పొడవున గాయమవడంతో ఎయిర్‌పోర్టులోనే ప్రాథమిక చికిత్స చేసి విమానంలో హైదరాబాద్‌కు పంపించేశారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావును జగన్‌ భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు పట్టుకుని సీఐఎ్‌సఎఫ్‌ అధికారులకు అప్పగించారు. అప్పటి సీఐఎ్‌సఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినే్‌షకుమార్‌ ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదుచేశా రు. నిందితుడు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తునకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ వేయడంతో అధికారులు శ్రీనివాసరావు ను వారంరోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. జగన్‌కు వీరాభిమాని అయిన శ్రీనివాసరావు ఇంటర్మీడియెట్‌ మధ్యలోనే ఆపేసి, దుబాయ్‌ వెళ్లి కొన్నాళ్లు ఉద్యోగం చేసి, తిరిగి స్వదేశానికి వచ్చి 2017లో ఎయిర్‌పోర్టులో కుక్‌గా చేరినట్టు దర్యాప్తులో గుర్తించారు.  కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో అదే విషయాన్ని పేర్కొన్నారు. రెస్టారెంట్‌లోనే పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి విమాననగర్‌లో అద్దె ఇంట్లో ఉండేవాడని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతుండేవాడని, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ 11 పేజీల లేఖను వరుసకు సోదరి అయ్యే యువతితో రాయించినట్టు రిమాండ్‌ రిపోర్టులో వివరించా రు. మామూలుగా లేఖ ఇస్తే.. జగన్‌ దానిని పట్టించుకోరని, ఏదైనా సంచలనం సృష్టించడం ద్వారా తన ఆశయాలు అమలయ్యేలా చేసేందు కే ఈ దాడికి వ్యూహం పన్నాడని, దాడి చేయడానికి రెస్టారెంట్‌లో ఫ్రూట్స్‌ డెకరేషన్‌కు వాడే కత్తి(పందాల సమయంలో కోళ్లకు కడుతుంటారు)తోపాటు మరో చిన్నపాటి కత్తిని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలకు తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేనందున కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దాడి వెనుక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దీంతో కేసును ఎన్‌ఐఏ కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తిచేసిన ఎన్‌ఐఏ అధికారులు చార్జిషీట్‌ను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో దాఖలు చేశారు. జగన్‌ ఏపీలో సీఎంగా ఉన్నందున, కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేయాలం టూ విశాఖకు చెందిన న్యాయవాది సలీం హైకోర్టులో పిటిషన్‌ వేసినా, కోర్టు నిర్ణయం తెలియరాలేదు.

Updated Date - 2021-10-27T09:02:55+05:30 IST