Abn logo
Sep 27 2021 @ 03:08AM

గుండె ‘గుడి’లో కొలువయ్యాడు!

హెడ్‌కానిస్టేబుల్‌కు గుడి కట్టించిన భార్య

ఆవిష్కరించిన ఎస్పీ కౌశల్‌

భర్తే సర్వస్వంగా భావించిన ఓ పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ భార్య.. ఆయన మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన గుండెల్లో కొలువైన భర్త రూపం నిత్యం కళ్లముందు ఉండాలని భావించి ఏకంగా గుడి కట్టించారు. బందరు తాలూకా పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చిట్టిప్రోలు హరిబాబు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆయన స్మృత్యర్థం.. భార్య విజయనిర్మల పోతేపల్లిలోని తన ఇంటి స్థలంలో హరిబాబు పేరిట గుడి కట్టించారు. పోలీసులకు గుడి కట్టించడం అరుదైన విషయం కాగా, ఈ గుడిని, గుడిలోని విగ్రహాన్ని జిల్లా ఎస్పీ సిదార్థ కౌశల్‌ ఆదివారం ఆవిష్కరించారు. హరిబాబు పోలీసు శాఖలో 28 ఏళ్లు పనిచేశారని, విధి నిర్వహణలో ఉంటూ కరోనా సోకి మృతి చెందారని ఎస్పీ తెలిపారు. హరిబాబు భార్య, కుమార్టెలు ఆయనకు గుడి కట్టి పోలీసు శాఖ తరతరాలుగా గుర్తుండిపోయే విధంగా చేశారని కొనియాడారు. ఎస్పీతోపాటు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, ఎస్‌బీ డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ కొండయ్య తదితరులు హరిబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.     -మచిలీపట్నం టౌన్‌

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...